ఎన్నికలు రాగానే ఆకర్షణీయ పథకాలతో ముందుకు వచ్చే టీడీపీ, జనసేనల మేనిఫెస్టోను ఏపీ ప్రజలు నమ్మొద్దని సీఎం జగన్ మోహన్రెడ్డి్ (CM Jagan) పిలుపునిచ్చారు. అనకాపల్లి జిల్లా పిసినికాడలో ‘వైఎస్సార్ చేయూత’ నాలుగో విడత నిధులను బటన్ నొక్కి విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు (Chandrababu) నమ్మడం అంటే కాటేసే పామును నమ్మడమేనని ఎద్దేవా చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడే చంద్రబాబుకు బీసీలు గుర్తొస్తారని, బీసీలకు ఆయన చేసిన సేవలు గుండు సున్నాయేనని విమర్శించారు. 2014లో తన మేనిఫెస్టో (Manifesto) ను చెత్తబుట్టలో వేసిన ఘనుడని వ్యాఖ్యనించారు.