లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా 36 మందితో కూడిన జాబితాను కాంగ్రెస్ హైకమాండ్ విడుదల చేసింది. ఇందులో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో 6 స్థానాలకు, కర్ణాటకలో 6 స్థానాలకు, కేరళలో 15 స్థానాలకు, మేఘాలయలో 2 స్థానాలకు, తెలంగాణలో 4 స్థానాలకు, నాగలాండ్, సిక్కిం, త్రిపుర రాష్ట్రాల్లో ఒక్కో స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. కర్ణాటకలోని ఉడుపి, చిత్రదుర్గ, తెలంగాణలోని మహబూబ్‌నగర్ ఎంపీ స్థానాల అభ్యర్థుల పేర్లను హోల్డ్‌లో ఉంచింది.కేరళలోని వయనాడ్ ఎంపీ నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయబోతున్నారు. ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ భగేల్ రాజ్‌నంద్‌గావ్ నుంచి బరిలో దిగనున్నారు. బెంగళూరు రూరల్ నుంచి డీకే సురేశ్, త్రిశూర్ నుంచి కే మురళీధరన్, తిరువనంతపురం నుంచి శశిథరూర్ పోటీ చేయనున్నారు.