శ్రీరాంసాగర్‌ జలాశయంలో ముగ్గురు యువకులు గల్లంతు

పండుగపూట నిజామాబాద్‌ (Nazamabad)జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శ్రీరాంసాగర్‌ జలాశయంలో( Sriramsagar reservoir) పడి(Drowned) ముగ్గురు యువకులు(Three Youths) గల్లంతయ్యారు. ఈ విషాదకర సంఘటన మెండోర మండలంలోని ఎస్సారెస్సీ లక్ష్మీ కాలువ హెడ్‌రెగ్యులేటర్‌ వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. గమనించిన స్థానికులు అధికారులకు సమాచారమిచ్చారు. స్థానికులు, అధికారులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన యువకులు సాయినాథ్, లోకేష్, మున్నాను జక్రాన్‌పల్లి మండలం గున్యా తండా వాసులుగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Spread the love