ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)’ లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టుంది. డీడీయూ మార్గ్‌లోని ఆప్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో.. పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ప్రచారాన్ని ప్రారంభించారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్, పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఢిల్లీ ప్రజలంతా తన కుటుంబ సభ్యులనీ, అందరం ప్రజాసేవకు అంకింతమై పని చేస్తున్నామని చెప్పారు. పార్లమెంటులో బలపడటం ద్వారా ఢిల్లీ ప్రజల అభ్యుదయానికి మరింత పాటుపడగలమని, అందుకోసం పట్టుదలగా పనిచేయాలని కార్యకర్తలకు కేజ్రీవాల్ దిశానిర్దేశం చేశారు.