కెసిఆర్ కళాభారతి పేరు మార్పు చేయాలని కాంగ్రెస్ పార్టి ఆద్వర్యంలో మిర్యాలగూడ ఆర్దిఒ వినతి పత్రం ఇచ్చారు
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ మినీ రవీంద్ర భారతి గా పిలవబడుతున్నటువంటి కళాక్షేత్రానికి ఎలాంటి తీర్మానాలు లేకుండా ఏ అధికారి యొక్క ఉత్తర్వులు కూడా లేకుండా కాంట్రాక్టర్ అత్యుత్సాహంతో తనకు నచ్చిన రీతిలో కెసిఆర్ కళాభారతి పేరును బోర్డుగా రాయించడం జరిగిందన్నారు . ఈ కళాక్షేత్రానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ లావాదేవీలన్నీ కూడా మినీ రవీంద్ర భారతి పేరు మీదనే జరుగుతున్నట్లు చెప్పారు . కాబట్టి ఈ కళాభారత్ కి గతంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అప్పటి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మాత్యులు దివంగత నేత జయపాల్ రెడ్డి ఈ కళాక్షేత్రాన్ని మంజూరు చేయించి ఈ భవన నిర్మాణానికి రెండు కోట్ల రూపాయల నిధులను కూడా సమకూర్చడం జరిగిందని అన్నారు . పనులు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జరిగినవని కాబట్టి దీనిని మినీ రవీంద్ర భారతి గానే పిలవాలని అన్నారు ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్నందువలన ఎలాంటి రాజకీయ నాయకుల పేర్ల మీద కళాక్షేత్రాలు ఉండకూడదు కాబట్టి వెంటనే ఆ బోర్డును తొలగించి సదరు కాంట్రాక్టర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోగలరని అన్నారు .
ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తమ్మడ బోయిన అర్జున్, కౌన్సిలర్లు దేశిడి శేఖర్ రెడ్డి, గంధం రామకృష్ణ ,జావీద్, చల్ల నాగమ్మవెంకన్న, గుంజా చంద్రకళశ్రీనివాస్, కోడి రెక్కఇంద్ర కుమార్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అజార్, మాజీ కౌన్సిలర్లు ఆలగడప గిరిధర్, పాతూరి ప్రసాద్, యాదగిరి, బల్గురు శ్రీనివాస్, వార్డ్ ఇన్చార్జిలు సలీం, ఆరిఫ్, నాగిరెడ్డి ,గోవర్ధన చారి, వెంకటకృష్ణ, అబ్దుల్లా, విష్ణు, చక్రి, మంగ్య నాయక్, బెజ్జం నాగరాజు, పర్వేజ్ ఖాన్, ఇమ్రాన్, అనిల్, గోదాల జానకి రామ్ రెడ్డి, బంటువీటి,కాశయ్య, హలీం, సంతోష్, రమేష్ నాయక్, సికిందర్, అవుట శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు మరియు బి ఎల్ ఆర్ బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు.