నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ అధ్యక్షుడు పుట్టల దినేష్ ఆధ్వర్యంలో విలేకరుల ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం లో నల్గొండ జిల్లా పార్లమెంట్ అభ్యర్థి వీరిగినేని అంజయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ బిఎస్పీ జాతీయ అధ్యక్షులు మాయావతి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్ లకు పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను ప్రకటించి ఈ అవకాశం కల్పించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు నల్గొండ జిల్లా ప్రజలకు నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతో ఏనుగు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని వేడుకొన్నారు. ఈ కార్యక్రమంలోనియోజకవర్గ ఇంచార్జ్ కుందారపు రమేష్ నల్గొండ జిల్లా ఉపాధ్యక్షుడు తక్కలపల్లి శ్రీను, మిర్యాలగూడ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు, నాని నాగరాజు నియోజకవర్గ కోశాధికారి గాలిబ్, అడవిదేవులపల్లి మండల అధ్యక్షులు కళ్యాణ్, దామచర్ల మండల అధ్యక్షుడు, బైరం సైదులు, దామచర్ల మండలం ఉపాధ్యక్షులు మంద నాగేంద్రబాబు, పట్టణ నాయకుడు సందీప్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.