రుణమాఫీ కోసం రైతులు కళ్ళల్లో వత్తులు వేకొని చూసే రైతులకు రేవంత్ ప్రభత్వం రైతుల్లో ఆశలు రికేత్తిచ్చింది…. ఒకే దాఫా అని మూడు విడతలుగా మాఫి చేశారు అయినా రైతులు లక్షల్లో మిగిలే ఉండటం తో ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది గ్రామీణ ప్రాంతాలలో రుణమాఫికాని రైతులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు… రుణమాఫి ఫై ప్రభుత్వం గట్టి సంకల్పతో ఉన్నా.. వ్యవసాయ… బ్యాంకు అధికారుల సమన్వయ లోపం వల్ల రైతుల ఇబ్బందులు కలుగుతున్నాయి .
అధికారుల సమాన్వయ లోపం రైతులకు శాపం
అధికారులు రివ్యూ మీటింగులో ఏర్పడబోయే ఇబ్బందుల గురించి ప్రభుత్వానికి వారు సరైన సూచనలు సలహాలు ఇవ్వకపోవటం వల్ల తప్పిదాలు జరిగినట్లు తెలుస్తోంది… మాఫికి ముందు అధికారుల కసరత్తు సరిగా జరగలేదని విమర్శలు వస్తున్నాయి… బ్యాంకుల.. వ్యవసాయ అధికారుల చుట్టూ రైతులు తిరగలేక రైతులు యాష్టపడుతున్నారు… బ్యాంకర్స్ మాదగ్గర ఏమీ సమాచారం లేదంటున్నారు… ఏ వోలు ఏఈవోలు మేము ఏమిచేయ్యలేం అని ఒకరిమీద ఒకరు చెప్పుకుంటున్నారు… ప్రభుత్వ విధాన నిర్ణయం వస్తే తప్ప తమ చేతుల్లో ఏమీ లేదని వ్యవసాయ అధికారులు… తేల్చి చెపుతున్నారు లాగిన్ కొట్టి వచ్చింది చెబుతున్నారు ప్రభుత్వం
ప్రతీ రోజు ప్రకటనలు రుణమాఫీ అమలు చేస్తామని వస్తున్నాయి కానీ అమలు కాలయాపనతో ఆశాజానకంగా లేదని విమర్శలు విని పిస్తున్నాయి
ప్రభుత్వ ఆలస్యం – రైతుల్లో గందరగోళం
అయితే బడ్జెట్ లో రైతులకు ఎక్కవ బడ్జెట్ పెట్టింది నిజం గత ప్రభుత్వం కంటే విద్య వ్యసాయానికి ఎక్కువ కేటాయింపులు చేసినా.. రుణమాఫీ విదాన నిర్ణయం ఆలస్యం అవ్వడం తో కేటాయింపు విషయం మరుగున పడుతుంది.. బ్యాంకు లోన్ ఇచ్చేటప్పుడు ఆధార్ కార్డు తీసుకోలేదని వ్యవసాయ అధికారులు బ్యాంకులను విమర్శి స్తున్నారు .. కానీ ఆధార్ కార్డు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు తప్ప దేనికి తీసుకోవద్దని సుప్రీం కోర్ట్ గైడులైన్స్ ఉన్నాయనే విషయం చాలామంది అధికారులకు తేలియదు.. సిమ్ కార్డు కొనటానికి కూడా ఆధార్ ని విచ్చలవిడిగా ఉపయోగించటం దేశ భద్రతకు ముప్పు అని చాలా మంది అధికారులకు తెలియదు కొందరిదగ్గర ఏవోలు అప్లికేషన్స్ తీసుకుంటున్నారు…. ప్రభుత్వం నుండి విధాన నిర్ణయం వస్తే దాన్ని అమలు పరుస్తామని అధికారులు చెబుతున్నారు…. ప్రభత్వ నిర్ణయం ఆలస్యం కావడం తో రైతుల్లో గందరగోళం నెలకొంది అందువల్ల ప్రభుత్వం చెప్పే విషయం రైతులకు కనెక్ట్ కావటం లేదు.. ప్రతిపక్షాలు చెప్పేదే రైతులకు కనెక్ట్ అవుతుంది. దిక్కుతోచని స్థితి లో రైతులున్నారు…
మూడు విడతలు రుణమాఫి చేసినా లక్షల్లో రైతులు మిగిలే ఉన్నారు
మొదటి విడత జూను 18 న 6098 కోట్లు 11-50 రైతుల కోసం జమ చేశారు.ఖాతలో జమ చేశారు… రెండవ దపలో లక్షన్నర రుణాకోసం 60198 కోట్లు యిచ్చారు.. 18 లక్షల రైతులకు జమ రెండు విడతల్లో 1224 కోట్లు రైతులకు అందినట్లు తెలుస్తోన్నది అయినట్లు ప్రభుత్వ వర్గాలు చెపుతున్నాయి.. మూడవ విడతలో 8000 కోట్లు బ్యాంకులోవేసినా 24 లక్షల లబ్దిదారులు దాటలేదని ప్రభుత్వాలెక్కలే చెబుతున్నాయి…కానీ గ్రౌండ్లో ఆ పరిస్థితి లేదు రైతులు నెత్తి నోరు మత్తుకుంటున్నారు.. నాన్ పారఫర్మెన్స్ అకౌంట్స్ 691000 వేలు ఉన్నాట్లు తెలుస్తోంది ఆధార్లో అక్షర దోషాలు… అకౌంట్స్ క్లోజ్ చేసుకున్నవి రావాటం లేదు … చిన్న చిన్న సమస్యలు చిక్కుముడి పడి రైతులకు ఇబ్బంది కలుగుతుంది…. ఎక్కువగా కెనరా బ్యాంకు.. ఇండియన్ ఆపరేటివ్ బ్యాంకుల వల్ల ఎక్కువ సమస్యలు వస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. కో ఆపరేటివ్ బ్యాంకు ల్లోరైతులకు తెలియకుండానే అధికారులు గోల్ మాల్ చేసినట్లు తెలుస్తోంది..
ఐదు ఎకరాల రైతుల రుణమాఫి అయితే 80 శాతం అయినట్లే
80 శాతం మంది రైతులు పావు ఎకరం నుండి ఐదు ఎకరాల లోపువాళ్ళే ఉన్నారు… వాళ్ళు సమస్య పరిస్కారం అయితే 80 శాతం రైతుల రుణమాఫి సమస్య పరిస్కారం అయినట్లే… చిన్న సన్నకారు రైతులు రియల్ ఎస్టేట్ చేసేది చాలా తక్కువ… వారిని పాత రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం… ప్రభుత్వం వెంటనే… తిరిగి వచ్చిన డబ్బులు ఇవ్వటం మొదలు పెడితే రైతుల్లో భరోసా వస్తుంది… రేషన్ కార్డు లేకపోయినా రుణమాఫి అవుతుందని జీవో లో చేర్చారు… కానీ వారికి కూడా కాలేదు… కొందరికి రేషన్ కార్డు ఉన్నా కరోనా టైమ్ లో గ్రామాలకు వెళ్లడం వల్ల రేషన్ తీసుకో ప్పవడం తో వారికి రేషన్ కట్ అయ్యింది వారికి కూడా రుణమాఫీ కాలేదు ప్రతీపక్షాల విమర్శలు వెనకడుగు వేస్థాయి.. ప్రభుత్వం రుణమాఫి చెయ్యాలనే బలమైన సకల్పం ఉన్నప్పటికీ మూడు అడుగులు ముందుకు రెండు అడుగు వెనక్కి చందంగా కన్పిస్తుంది…
అధికారుల సమాన్వయ లోపం బ్యాంక్ ల తప్పిదాలు
అధికారుల సమాన్వయ లోపం బ్యాంకర్స్ తప్పిదాలు ప్రభుత్వానికి శాపంగా మారుతున్నాయి.. రుణమాఫి క్లియర్ అయితే ప్లానడ్ బడ్జెట్లో వెల్ఫేర్ కార్యక్రమాలకు పెన్సషన్స్ కీ లోటు ఉండకపోవచ్చు …. రుణమాఫికి లిమిటేషను ఐదు ఎకరాలా.. పది ఎకరాలా.. భూమి ఎంత ఉన్నా రెండు లక్షలు చేస్తారా అనేది బ్రభుత్వం నిర్ణయించలేదు.. ప్రభుత్వం ఈ సాంకేతిక సమస్యలు అడదిగ మించాలంటే ? ఈ దఫా రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం భూములు పరిశీలించి రుణమాఫి చేస్తే ప్రతిపక్షాల విమర్శలు అది దిగ మించవచ్చు… ప్రతీ రోజు చేస్తా అనేదానికంటే వేనక్కు తిరిగి వచ్చిన…డబ్బులను మిగిల్చిన డబ్బులను వేoటనే రైతులకు ఇవ్వటం మంచిది… చిన్న సన్నకారు రైతుల రుణమాఫీ సత్వార పరిస్కారమే ప్రభుత్వo ప్రధమ కర్తవ్యం గా ఉండాలనీ రేవంత్ రెడ్డి సర్కార్ ఆ విదంగా ముందుకు పోవాలని ఆశిద్దాం….
సాధం వెంకట్ MA, MCJ.
సీనియర్ జర్నలిస్ట్ : 9395315326.