తెలంగాణలో ఉద్యమకారులకు పెన్షన్, సంక్షేమం అభివృద్ధి, ఇంటి స్థలం ఊసేలేదు. ఉద్యమకారులతో చర్చలు లేవు.పర్యావరణానికి నష్టం చేసే ఫార్మాసిటీలు రద్దు చేయలేదు. మహబూబ్నగర్ లో నిమ్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం నిలిపేయలేదు. ఉత్తర తెలంగాణలో విస్తరించి ఉన్న సింగరేణి భవిష్యత్తుపైన హామీ లేదు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, బోధన్ షుగర్ ఫ్యాక్టరీ, సిర్పూర్ కాగజ్నగర్ కాగిత పరిశ్రమ, నిజాంబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు, సింగరేణిలో ఓపెన్ ఓపెన్ కాస్ట్ మైన్స్ రద్దు ఎన్నికల వాగ్దానాలు గానే మిగిలాయి. హామీల అమలు ప్రయత్నాలు ముమ్మరం చేయాలి.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాచలం డివిజన్ పరిధిలో ఐదు మండలాలను తిరిగి తెలంగాణ రాష్ట్రంలో కలపాలి, సరపాక పేపర్ బోర్డు లో,మణుగూరు పవర్ ప్లాంట్ లో, సత్తుపల్లి కిన్లీ వాటర్ ప్లాంట్ లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకుండ బయటి నుంచి వచ్చిన వారికి ఉద్యోగాలు ఇస్తున్నారు అనే స్థానికుల ఆవేదనలు ఎవరు పట్టించుకోవడం లేదు. ఒపెన్ కాస్ట్ బొగ్గు గనుల వల్ల స్థానిక ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు,వాటి స్థానంలో అండర్ గ్రౌండ్ బొగ్గు గనులు తవ్వాలి, భువనగిరిలో ఇద్దరు హాస్టల్ విద్యార్థులను / బాలికల అనుమానాస్పద మరణం పై నిరసన అడ్డుకున్నారు. సాంస్కృతిక పునరూజ్జీ వనంపై చర్చకు సమయమే ఇవ్వడం లేదు. !
తెలంగాణ ప్రజలు ఆకలి అయిన భరిస్తారు గానీ, స్వేచ్ఛ పైన దాడి జరిగితే మాత్రం సహించరు. ఒక రకంగా దీనిని రాజకీయ నాయకుల మాటలలో వచ్చిన గణనీయ మార్పుగా గుర్తించాలి.అధికారం దక్కించుకోవడానికి, దీర్ఘకాలం పదవిలో ఉండాలంటే పౌర సమాజం ముందు ఇలాంటి పదాలు వాడడం రాజకీయ పార్టీలకు, నేతలకు అవసరమే. దేనికైనా ఆచరణ గీటు రాయి.
త్వరలో పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. గత ఎన్నికలలో ఇచ్చిన హామీలు అమలు కోసం పౌర ప్రజాస్వామికవాదులు గళం ఎత్తాల్సిన సమయం ఇది. ఇప్పటికే ఇచ్చిన హామీల అమలు కోసం, ప్రజాస్వామిక వాతావరణ ఏర్పాటు కోసం, రాజకీయ పార్టీ లను నిలదీయాల్సిన సమయమిది. మౌలిక సమస్యల చర్చించకుండ, పరిష్కారం కోసం కృషి చేయకుండ పాలకుల వాగ్దానాల వలలో చిక్కితే పులి -బంగారు కంకణం కథ పునరావృతం అవుతుంది పౌర ప్రజాస్వామిక వాదులారా! బుద్ధి జీవులారా! 🗣️ ప్రజలారా! పారాహుషార్!
✍🏻 రమణాచారి, తెలంగాణ ఉద్యమకారుడు,9989863039