శ్రవణ్ శాస్త్రికి ఇంటర్నేషనల్ ఆస్ట్రో ఎక్సలెన్స్ అవార్డు ప్రధానం

 

వరంగల్, (బెల్ టైమ్స్ ) జూన్ 27:
వరంగల్ జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యా యుడు ,వేద జ్యోతిష పరిశీలకులు బూర్గుపల్లి శ్రవణ్ కుమార్ (శ్రవణ్ శాస్త్రి)కి
ఇంటర్నేషనల్ వేదిక్ ఆస్ట్రాలజీ ఫెడరేషన్ ఐవిఎఫ్ఎ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ఆస్ట్రో ఎక్సలెన్స్ అవార్డు ప్రధానం చేశారు.ఈనెల 23న న్యూఢిల్లీలో నిర్వహించిన అంతర్జాతీయ వేద జ్యోతిష సమ్మేళనానికి వరంగల్ జిల్లా నెక్కొండకు చెందిన జ్యోతిషవాస్తు బ్రహ్మ శ్రావణ్ శాస్త్రికి ఆహ్వానం అందిన సంగతి విదితమే. ఇంటర్నేషనల్ వేదిక్ ఆస్ట్రాలజీ ఫెడరేషన్ యుఎస్, ఇండియా చార్టర్లు సంయుక్తంగా న్యూఢిల్లీ లోని ప్రఖ్యాత ఇంటర్నేషనల్ హోటల్ రాడిసన్ బ్లూ లో నిర్వహించిన ఈ సదస్సుకు జమ్ములోని వైష్ణో దేవి సంస్థాన్ వ్యవస్థాపకులు పూనమ్ మాతాజీ ముఖ్య అతిథులుగా, ధరం గురు ఇంటర్నేషనల్ బ్రాండ్ అంబాసిడర్ డాక్టర్ హెచ్ ఎస్ రావత్, హీరో మోటార్స్ గ్రూపు చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ముంజాల్, మాజీ రక్షణ న్యాయమంత్రిత్వ శాఖాధిపతి వై కే గుప్త తోపాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు గౌరవ అతిథులుగా హాజరయ్యారు. వేద జ్యోతిష, వాస్తు, ఆధ్యాత్మిక రంగాలలో పరిశోధనలు చేసి లబ్ద ప్రతిష్టులైన ప్రముఖులను సత్కరించగా అదే వేదికపై వేద జ్యోతిషంలో రెండు దశాబ్దాలుగా సేవలందిస్తున్న శ్రవణ్ శాస్త్రికి అవకాశం ఇచ్చి ఇంటర్నేషనల్ ఆస్ట్రో ఎక్సలెంట్ అవార్డుతో సత్కరించారు.

వేద జ్యోతిషంలో పరిశీలనకు దక్కిన గుర్తింపు

2006-08 సంవత్సరంలో హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఎంఏ జ్యోతిషంలో స్నాతకోత్తర డిగ్రీ అందుకున్న శ్రవణ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే వేద జ్యోతిషంపై అభిరుచితో ప్రొఫెషనల్ ఆస్ట్రాలజర్ గా సేవలందిస్తుస్తున్నారు. హైదరాబాదులోని తెలుగు విశ్వవిద్యాలయంలో 2006- 08లో ఎంఏ జ్యోతిష్య శాస్త్రం అభ్యసించిన శ్రవణ్ శాస్త్రి అప్పటినుండి ప్రొఫెషనల్ ఆస్ట్రాలజర్ గా సేవలందిస్తున్నారు..వివాహ సమయం- జ్యోతిష ప్రభావం అనే అంశంపై పరిశోధనాత్మక వ్యాసాన్ని సమర్పించడం తో పాటు వ్యక్తిగత సమస్యలు -జ్యోతిష్య పరిష్కారాలు (ఆస్ట్రాలజికల్ రెమెడీస్) అనే అంశంపై పరిశీలన సాగిస్తున్నారు. నెక్కొండ మండలం అప్పలరావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న శ్రవణ్ గురువారం బెల్ టీవీ ప్రతినిధితో మాట్లాడుతూ ఢిల్లీ వేద జ్యోతిష సమ్మేళనంలో తనకు లభించిన గుర్తింపు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, తనపై బాధ్యత మరింత పెంచిందని అన్నారు. వ్యాపార దృక్పథంతో కాకుండా వేద జ్యోతిష శాస్త్రం సేవలు సామాన్య జనబాహుళ్యంలో మేలుచేకూర్చే విధంగా పనిచేయాలని, ప్రాచీన కాలం నుండి వేద జ్యోతిషం పై పలు పరిశోధనలు సాగుతున్నా యని, 2050 నాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి దీటుగా వేద జ్యోతిషం తన ప్రత్యేకతను చాటుకుంటుందన్నారు. ఢిల్లీ వేదికలో పాల్గొనేలా తనకు అవకాశం కల్పించిన ఇంటర్నేషనల్ వేదిక్ ఆస్ట్రాలజీ ఫెడరేషన్ ఫెడరేషన్ డైరెక్టర్లు డాక్టర్ మనీష్ శర్మ, దివ్య పిళ్ళై, అల్కాశర్మలకు , వేద జ్యోతిషములో సందేహాలను నివృత్తి చేస్తూ ప్రోత్సహిస్తున్న గురువులకు పత్రికా ముఖంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇంటర్నేషనల్ అష్ట్రో ఎక్సలెన్స్ అవార్డు అందుకున్న స్టేట్ కన్జ్యూమర్ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి బూరుగుపల్లి శ్రవణ్ కుమార్ ను కన్జ్యూమర్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (సి సి ఐ ) జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి, దక్షిణాది రాష్ట్రాల సమాఖ్య అధ్యక్షులు డాక్టర్ పల్లెపాడు దామోదర్, రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగిలిచర్ల సుదర్శన్ అభినందించారు

 

శ్రవణ్ శాస్త్రి సేవలు ప్రశంసనీయం
అవార్డు గ్రహీతను సన్మానించిన గౌతమి హై స్కూల్ యాజమాన్యం

ఆధ్యాత్మిక ,వేద జ్యోతిష రంగాలలో నెక్కొండ కు చెందిన బూరుగుపల్లి శ్రవణ్ శాస్త్రి అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని గౌతమి విద్యానికేతన్ హై స్కూల్ కరస్పాండెంట్ అనంతుల మురళీధర్ ,ప్రిన్సిపల్ కల్పనలు అన్నారు.
ఇంటర్నేషనల్ ఆస్ట్రో ఎక్సలెన్స్ అవార్డు గ్రహీత, గౌతమి విద్యానికేతన్ హై స్కూల్ పేరేంట్, ఆత్మీయ మిత్రుడు బూరుగుపల్లి శ్రవణ్ శాస్త్రి ఇంటర్నేషనల్ వేదిక్ ఆస్ట్రో ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 23న న్యూఢిల్లీలో జరిగిన వేద జ్యోతిష్య సమ్మేళనంలో ఇంటర్నేషనల్ ఆస్ట్రో ఎక్సలెన్స్ అవార్డు అందుకున్న సందర్భంగా ప్రిన్సిపల్ ఆనంతుల కల్పన అధ్యక్షతన పాఠశాలలో అభినందన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కరస్పాండెంట్ అనంతల మురళీధర్ మాట్లాడుతూ తెలుగు విశ్వవిద్యాలయంలో ప్రొఫెషనల్ ఆస్ట్రాలజీ లో పీజీ పూర్తి చేసిన శ్రవణ్ రెండు దశాబ్దాలుగా వేదిక్ ఆస్ట్రాలజీలో పరిశీలనలు చేస్తూ ఈ ప్రాంత ప్రజలకు సేవలు అందిస్తుండటం ప్రశంసనీయమన్నారు. ఢిల్లీ వేదికగా పాఠశాల పేరంటైన శ్రవణ్ అవార్డు అందుకోవడం తమకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని, వారి సేవలు మరింత విస్తృతం కావాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. పాఠశాలలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో శ్రవణ్ శాస్త్రికి పుష్పగుచ్చం అందించి శాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం మధుకర్ రెడ్డి, అజయ్ కుమార్, సుజిత్, శిరీష తదితరులు పాల్గొన్నారు.

ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘన సన్మానం

అభినందించిన ఎస్ఐ మహేందర్

గ్రామ స్థాయిలో పుట్టి పెరిగినప్పటికీ పట్టుదలతో ఆధ్యాత్మిక ,వేద జ్యోతిష రంగాలలో ముందుకు సాగుతూ నెక్కొండ కు చెందిన బూరుగుపల్లి శ్రవణ్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఆస్ట్రో ఎక్సలెన్స్ అవార్డు అందుకోవడం గర్వకారణమని నెక్కొండ ఎస్ఐ మహేందర్ అన్నారు. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నెక్కొండ మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో అవార్డు గ్రహీత శ్రవణ్ శాస్త్రిని పాత్రికేయులు ఘనంగా సన్మానించారు. బొకే, మెమొoటోలు అందించి శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి ఎస్ఐ ముఖ్యఅతిథిగా హాజరై శ్రవణ్ శాస్త్రి కి బోకే అందజేసి శాలువాతో సత్కరించి అభినందించారు. దక్షిణాది కంటే ఉత్తర భారతంలో వేద జ్యోతిషానికి అధిక ప్రాచుర్యం ఉందని గుర్తు చేశారు. ఉత్తరాది వారితో తెలంగాణ వాసులు పోటీపడి ముందుకు సాగడం అభినందనీయమన్నారు. వేద జ్యోతిషంలో పరిశోధనలు అరుదుగా సాగుతున్నాయని, వేద విద్య పండిత పామరులకు మరింత చేరువ కావాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నెక్కొండ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బివియన్ శాస్త్రి గౌరవ అధ్యక్షుడు గిరగాని శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మునిగే ప్రభాకర్, కోశాధికారి రామారపు రాము, సంయుక్త కార్యదర్శులు
సంగని మధు, ఎలికట్టే శ్రీనివాస్, పాత్రికేయ మిత్రులు దాసరి శ్రీనివాస్, పలుసం పూర్ణచందర్, శ్యామ్, హేమచందర్, శ్రీనివాస్, సురేష్, అశోక్, సైదులు, రాజనారాయణ అరుణ్, గందే రాజు, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love