కవులు, రచయితలపై ఆర్ యస్ యస్ ,ఎబివిపి దాడి హేయమైన చర్య అని కేవీపీఎస్ నల్లగొండ జిల్లా కమిటీ ఖండిచింది. మిర్యాలగూడ ఎస్ వి ఫంక్షన్ హాల్లో సోమవారం పత్రికా విలేకరుల సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున మాట్లాడుతూ సెక్యూలర్ రైటర్స్ ఫోరం సముహా రాష్ట్ర సదస్సు కాకతీయ విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో ఈ అనేక అంశాలపై చర్చలు జరుగుతున్న సందర్భంలో హాల్ లోపలికి ఎబివిపికి చెందిన వారు బ్యానర్ చింపి, సభను అడ్డుకోని డా: పసునూరి రవీందర్, ఫ్రోఫసర్ కాత్యాయని, నరేష్ కుమార్ షూపీ, మెర్సి మార్గరెట్, భూపతి వెంకటేశ్వర్లు తదితరులు పై దాడి చేశారు. ఈ దాడిని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నల్లగొండ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు .
దాడి చేయడమే కాదు అక్కడ ఉన్న మహిళలపై అనుచీతంగా వ్యవరించారన్నారు . తెలంగాణ రాష్ట్రంలో యూనివర్శీటీలో విద్యార్ధి సంఘం పేరుతో ఆ ర్ యస్ యస్,ఎబివిపి ఆరాచాకాలు చేస్తోందని మండిపడ్డారు . రాష్ట్రంలో ప్రశాంతంగా యూనివర్శీటీలలో అకడమిక్ వాతావరణం, భావప్రకటనను హరించే చర్యలకు పాల్పడుతున్నారు. మొన్న సంగారెడ్డి, కరీంనగర్ జిల్లాలో ఎస్ఎఫ్ఐ నాయకులపై దాడి, నిన్న హెచ్.సి.యు.లో గంజాయి, మద్యం మత్తులో విద్యార్ధులపై దాడి నేడు వరంగల్ లో కవులు ,రచయితలపై దాడి చేయడం హేయమైన చర్య అన్నారు . బిజెపి, ఆరెస్సెస్ తోకైన ఎబివిపి రచయితలు, కవుల మీద భౌతిక దాడులు చేయడాన్ని ప్రజాస్వామిక వాదులు, మేధావులు ఖండించాలని కేవీపీయస్ కోరారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీను,రాష్ట్ర కమిటీ సభ్యుడు
గాదె నరసింహ, ధైద శ్రీను, బొల్యు రవీందర్ , పాపారావు, దేవయ్య ,వెంకటయ్య,రేమిడాల పరుషరాములు తదితరులు పాల్గొన్నారు .