ఫ్లెక్సీలను తొలగించడం హెయమైన చర్య… కట్ట మల్లేష్ గౌడ్

వేములపల్లి జూన్ 01: (బెల్ టైమ్స్ ) :
గుడి శాశ్వత చందా దారుల పేర్లు గల ఫ్లెక్సీ లను తొలగించడం హెయా మైన చర్య అని బిఆరెస్ జిల్లా నాయకులు కట్టా మల్లేష్ గౌడ్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ శ్రీశ్రీశ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయ 11వ వార్షికోత్సవ లను శనివారం నిర్వహించారు. దీనిలో భాగంగా శాశ్వత దాతల పేర్లతో కూడిన ఫ్లెక్సీలు గుడి వద్ద ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కక్షపూరితంగా ఫ్లెక్సీలను పోలీసు అధికారులతో కలిసి తొలగించడాన్ని టిఆర్ఎస్ జిల్లా నాయకులు కట్ట మల్లేష్ గౌడ్ తీవ్రంగా ఖండించారు.
వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేవాలయం కు సంబంధించిన వ్యవహారాలను పార్టీలకు పూసి వ్యక్తిగత కక్షలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు తావిస్తున్నారు. గత 15 సంవత్సరాలుగా ఉత్సవాలు నిర్వహిస్తుండగా ఎన్నడూ ఇలాంటి సంఘటనలు జరగలేదని తెలిపారు. దాతలు లేనిది గుడి నిర్మాణం, అభివృద్ధి అనేది జరగదు అలాంటి దాతలు ఫ్లెక్సీలు తీసివేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. గుడికి దాతలు ఇచ్చిన చందా ఇచ్చిన దాతల పేర్లతో కూడిన ఫ్లెక్సీని తీసేసిన అధికారులు పక్కనే ఉన్న శాసనసభ్యులు లక్ష్మారెడ్డి పేరుతో ఉన్న ఫ్లెక్సీలను ఎందుకు తీయలేదని ప్రశ్నించారు. ఇదేమిటని ప్రశ్నించగా మేము ఎమ్మెల్యే అనుచరులం మేము ఇంతే చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వ్యవహరిస్తున్నారని అన్నారు. స్వయంగా పోలీసు అధికారులే వచ్చి ఫ్లెక్సీలను తొలగించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కొమ్ముకాస్తున్నారని పేర్కొన్నారు. పోలీసులే వచ్చి ఆ ఫ్లెక్సీలను తొలగించడంతో భక్తుల మనోభావాలను దెబ్బతింటున్నాయని వాపోయారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మజ్జికపు సుధాకర్ రెడ్డి, పెద్దపంగ సైదులు, నక్క నాగరాజు, బంటు రాము, కలుకూరి వేణు, ఎర్రబెల్లి చంటి ,నక్క శ్రీధర్, తంగెళ్ల సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు

Spread the love