రాహుల్ గాంధీ సమక్షంలో రైతు రుణమాఫిని ప్రకటించిన కాంగ్రెస్… అధికారం లోకి వచ్చాక రుణమాఫి చేసి ముఖ్యమంత్రి రేవంతరెడ్డి మాట నిలబెట్టుకున్నారు… దీనితో పేద రైతులు ఆనందం తో ఉన్నారు… వారికి న్యాయం జరిగినట్లు అయ్యింది…. రైతు రుణమాఫి ఫై పెద్దఎత్తున చర్చజరిగింది … ఒక దశలో ప్రభుత్వం చెయ్యలేదని కూడ సోషల్ మీడియా… మీడియాలో ప్రతి పక్షాలు చర్చకు తెరలేపాయి… రైతుల సంఖ్య బాగా తగ్గించారనే విమర్శలు ఉన్నప్పటికీ చిన్న సన్నకారు రైతులను విస్మరించకుండా న్యాయం చేశారనేది మిగిలింది..
రేవంత్ రెడ్డి రుణమాఫి చేసి ఆ చర్చకు ముగింపు పలికారు… ఓట్లు వేసిన రైతులకు ఊరట కలిగిoచారు… అంతకు ముందు నేను రాసిన “రుణమాఫితో రైతులంతా సాఫీ ” ఎవరు రాయని విషయాన్ని నేను ఎడిట్ పేజీకి రాసిన విషయాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది.. అనేక సందర్బలలో ముఖ్యమంత్రి రేవంతరెడ్డి… డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రస్థావించారు… నా సూచనలు అమలయ్యాయి…
అంతకు ముందు రేషన్ కార్డు పట్టాదారు పాసుబుక్ నిబంధన పెడుతున్నట్లు చర్చ జరిగింది… కానీ అవి ఏవీ లేకుండానే కేవలం పేదరికం ఆధారoగానే రుణమాఫి జరగడం తో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తో oది… రుణాలు చెల్లించి రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫి లేదని మీడియా లో రావడం తో రైతులు కొంత నిరుత్సాహo పడ్డది వాస్తవం… కానీ అధికారులతో హై లెవల్ మీటింగ్ పెట్టి జీవో లో పట్టాదారు పాస్ బుక్ ఆధారాంగానే రుణమాఫీ జరుగుతుందని… కుటుంబాన్ని గుర్తించటం కోసం మాత్రమే రేషన్ కార్డు ఉంటుందని… రుణాలు చెల్లించి తిరిగి తీసుకున్న వారికి కుడా మాఫి ఉంటుందని జీవో లో క్లియర్ గా ఇవ్వటంతో రైతుల అనoదాన్ని …. ముఖ్యమంత్రి ఆవిష్కరించి నట్లు అయ్యింది…
కానీ రైతు మార్కెటింగ్ లో ఆశక్తుడుగా మారుతున్నాడు.. దేశానికి వెన్నుముఖ రైతు అంటారు… పల్లెటూళ్ళే పట్టుగోమ్మలు కావాలంటే! పరిపూర్ణానంగా రైతులు ఎదిగే, రైతు సంక్షేమం కోసం ప్రభుత్వ విధాన నిర్ణయాలు ఉండాలి… అందుకోసం విత్తనాలు ఎరువులు సబ్సిడీ ఇవ్వాలి నూతన పోకడలు అలవార్చుకోవడం కోసం… వ్యవసాయ యాంత్రికారణకోసం సేంద్రియ సాగుకోసం ప్రభుత్వాలు రాయితినీ ఇచ్చి ప్రోత్సహించాలి… నేడు కూలిరేట్లు పెరగడం తో గిట్టుబాటు ధర రాక రైతు సత మతామౌతూ నిత్యం కష్ట నష్టాలకు గురి అవుతూ వ్యవసాయాన్ని రైతు కొనసాగిస్తున్నాడు… గ్రామీణ రైతు భారతం రుణగ్రస్థమై కునారిల్లుతుంది… దాన్నుంచి రైతులు బయటపడీ… రైతు ప్రోహత్సక విదానాలు ఉండే ప్రభుత్వాలు రావాలని కోరుకుందాం…
ఏదీ ఏమైనా ముప్పాయి ఒక్క వేల కోట్ల రుణమాఫి చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు ముఖ్యమంత్రి రేవంతరెడ్డి… బౌషాత్తులో కూడా రైతు అనుకూల విధాన నిర్ణయాలతో. ముందుకు పోవాలని కోరుకుందాం
సాదం వెంకట్ sr. జర్నలిస్ట్,
MA, MCJ.. 9395315326.