ఆరు దశాబ్దాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఏర్పడిన ప్రత్యేక రాష్ట్రం ఎలా ఉండాలి? ఎలా ఉంది? అనే అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. దక్షిణ భారత దేశంలో పెద్ద నదులు గోదావరి, కృష్ణలు తెలంగాణలో ప్రవేశిస్తున్నా తాగు, తాగునీటి సమస్య, సమస్యగానే మిగిలి ఉంది . పాలకుల దృష్టిలోపం, సాచివేత ధోరణి ఇందుకు ప్రధాన కారణం. సకాలంలో సరైన ప్రాజెక్టుల నిర్మాణం, జల వనరుల సక్రమ వినియోగంపై శాస్త్రీయ అవగాహన లోపం కారణంగానే ఈ దుస్థితికి కారణం. భవిష్యత్తులో తెలంగాణలో నీటి సమస్య,కరెంటు సమస్య ప్రధానం కాబోతున్నాయి. సాగునీటి మాట అటు ఉంచితే , తాగునీటికి కటకట ఏర్పడే పరిస్థితులు కనపడుతున్నాయి. రాజకీయ పంచాయతీలు, కుట్రలు జనం బ్రతుకులో చిచ్చు పెడుతున్నాయి. ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం పక్కకు పెట్టి,జనం నోరెళ్ల బెట్టి చూసే పరిస్థితి నుండి బయట పడే మార్గాలు అన్వేషించాలి .
రైతు సమస్యల మీద,విద్యారంగ సమస్యల మీద దృష్టి సారిస్తున్నట్టు ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. రైతు సమస్యలు అంటే విద్యుత్ సమస్య, గిట్టుబాటు ధర,కల్తీ పురుగుమందులు,విత్తనాలు. అన్నిoటికంటే ప్రధానమైనవి, సాగునీటి సమస్య. మరియు కౌలు రైతుల సమస్య, పోడు భూముల సమస్య, అన్యాక్రాంతమైన భూముల సమస్య లాంటి వాటిపై ఎలాంటి కార్యాచరణ ఉంటుందో స్పష్టం చేయలేదు. ఈసారి వర్షాభావం అధికంగా ఉండడం, మేడిగడ్డ సాకుగా నీటి విడుదలను ఆపేయడం మరో కొత్త సమస్యకు తెర లేపాయి. సమస్యను చేశాయి. అసలే తాగునీటి సమస్య పైగా ఎండాకాలం అంతా ముందే ఉంది. విద్యుత్ సమస్య/ సంక్షోభం తప్పదు. వీటిని పరిష్కరించే కార్యాచరణ కానరావడం లేదు.
సంక్షేమ పథకాల అమలుతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా సంక్షోభంలో కూలిపోయింది. ఉద్యోగుల మెప్పు కోసం మొదటి తారీకు జీతాలు మాత్రమే అమలవుతున్నాయి.TSGLI ,GPF,EL సరెండర్,వివిధ రకాల అడ్వాన్సులు బకాయలు ఎప్పుడు చెల్లిస్తారో చెప్పలేదు,బకాయి వున్న 4DA ల గురించి ప్రస్తావనే లేదు,317 GO రద్దు/సవరణ కు కమిటి రిపోర్ట్ ఇంత వరకు ఇవ్వలేదు,PRC కమిటి గడువు ముగిసిపోయింది ఇంకా కాలయాపన చేస్తున్నది.విద్యారంగ అభివృద్ధి కోసం 500 కోట్లతో ప్రతి మండలంలో ఒక భవనం ఏర్పాటు చేస్తామంటున్నారు. ఇప్పటికి భవనాల సంఖ్య ఇబ్బంది లేకున్నా ,ఉపాధ్యాయుల కొరత, మౌలిక వనరులు కోసం ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగా భవనాల నిర్మాణం అవసరం ఏమున్నట్లు ? కొత్త ఫ్లైఓవర్లు, రోడ్ల విస్తరణలు, కొత్త భవనాలు, కొత్త నిర్మాణాలు ఇప్పటికిప్పుడు ప్రధాన అంశాలు కావు .
✍🏻 రమణాచారి,
తెలంగాణ ఉద్యమకారుడు,9989863039