స్థలం రక్షణ పై నీలి నీడలు ….

నిడమనూరు ( బెల్ టైమ్స్ ) ఏప్రిల్ 6 : మండల కేంద్రంలోని (నాగార్జున జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ ) గోదాం నిరుపయోగంగా దర్శనమిస్తోంది. 1964 లో ప్రజా అవసరాల కోసం ఏర్పాటు చేసిన గోదాము లు నష్టాల పేరుతో 1987 లో మూత పడ్డాయి. అటు తర్వాత గోదాము లను అందుబాటులోకి తెచ్చేందుకు శాఖా పరమైన చర్యలు చేపట్టకపోవడం తో గోదాము లు నిరుపయోగంగా మారాయి. ఎన్డిసిఎంఎస్ కు చెందిన ఎ .3. 18 గుంటల స్థలంలో అప్పట్లో నిర్మించిన రెండు గోదాములకు గాను ఇటీవల శిధిలావస్థలో వున్నఒక గోదాం నేలమట్టమైంది. మూడేండ్ల క్రితం గోదాముకు పూర్తి స్థాయి మరమ్మతులు చేపట్టి ఎరువులు, విత్తన విక్రయ కేంద్రం ఏర్పాటుకు చర్యలు చేపట్టినా ఆచరణ లో సాధ్యం కాలేదు.

 

ఎన్ డీసీఎంస్ స్థలం రక్షణ పై నీలి నీడలు అలుముకున్నాయి. గతం లో స్థలం చుట్టూ స్థంబాలు ఏర్పాటు చేసినప్పటికీ వాటిని ధ్వంసం చేసి మరీ సమీప గృహాల రైతులు గడ్డివాములు ఏర్పాటు చేసుకున్నారు. సదరు స్థలం లో ఆట మైదానం ప్రైవేట్ వ్యక్తులు ఏర్పాటు చేయడం తో ఆక్రమణలకు తెర లేపినట్లైయింది. గతం లో మార్కెటింగ్ శాఖ అద్వర్యం లో రైస్ మిల్ నిర్మాణానికి అనుమతి కోరినా పంచాయితీ నిరాకరించడం తో ఎలాంటి నిర్మాణాలు లేని కారణం గా విలువైన స్థలం ఖాళీ గా దర్శనమిస్తుంది. ఇప్పటికైనా సంబంధిత శాఖాధికారులు స్థల రక్షణ తో పటు ప్రజలకు గోదామును అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు .

Spread the love