దేశంలోనే తొలిసారిగా నేషనల్‌ క్రియేటర్స్‌ అవార్డ్స్‌

దేశంలో ఇక ముందు సోషల్ మీడియా క్రియేటర్లకు కూడా గుర్తింపు దక్కనుంది. ఎందుకంటే ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఢిల్లీలోని భారత్ మండపంలో పలువురు డిజిటల్ కంటెంట్ క్రియేటర్లకు అవార్డులను అందజేశారు. నేషనల్‌ క్రియేటర్స్‌ పేరుతో ఈ అవార్డులను ప్రదానం చేశారు. అయితే ఇలా నేషనల్‌ క్రియేటర్స్‌ అవార్డులను ప్రదానం చేయడం దేశంలోనే తొలిసారి.

ఈ అవార్డుల కార్యక్రమంలో మైథిలీ ఠాకూర్‌కు ‘కల్చరల్ అంబాసిడర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు’ను ప్రధాని అందజేశారు. అదేవిధంగా జయ కిషోరికి బెస్ట్ క్రియేటర్ ఫర్ సోషల్ ఛేంజ్ అవార్డు, పంక్తి పాండేకు గ్రీన్ ఛాంపియన్ అవార్డు, పీయూష్ పురోహిత్‌కు ఉత్తమ నానో క్రియేటర్ అవార్డు అందజేశారు. సమాజంలో సానుకూల మార్పును తీసుకురావడం, కథలు చెప్పడం, పర్యావరణ సుస్థిరత, విద్య, గేమింగ్ తదితర ఆవిష్కరణలకు ప్రోత్సాహంలో కీలక పాత్ర పోషించిన డిజిటల్ కంటెంట్ క్రియేటర్లను గౌరవించడమే ఈ అవార్డుల ప్రధాన లక్ష్యమని అధికారులు చెప్పారు.

Spread the love